Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2024, 5:44 pm Posted by : ramakrishna

మహిళలు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి 

 జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ అరుణ 

 ఎల్లారెడ్డి , బతుకమ్మ :  మహిళలు  కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని  జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ  అరుణ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మహిళా ముఖ్య కార్యకర్తల  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు  గారి ఆదేశాల మేరకు మహిళా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని  మండలంలోని ప్రతి గ్రామాలలో బూత్ వార్డు, మండల కమిటీలు నిర్వహిస్తామన్నారు. రానున్న ఎన్నికల కోసం ప్రతి మహిళా కార్యకర్త  పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి గురించి  ప్రజలకు గుర్తు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే   మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారాని గుర్తు చేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ  అరుణ, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు  వాసవి గౌడ్ కు ఎల్లారెడ్డి వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్  మారెడ్డి రజిత వెంకటరామిరెడ్డి శాలులతో  సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Women should strengthen the Congress party