మహిళలు అన్ని రంగాల్లో ముందుకు ప్రయాణించాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో ముందుకు రావాలని ప్రతిభను కనబడుచాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని దానికి అనుగుణంగా మహిళలు ఉన్నత చదువులు చదువుకొని శక్తివంతులై అన్ని రంగాల్లో ముందుకు రావాలని అన్నారు. మహిళల ఆత్మ రక్షణ కోసం...