Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 6:26 pm Posted by : ramakrishna

మహిళలు అన్నీ రంగాల్లో ఆర్థికంగా ఎదగాలి

 

. . . గ్రామ సర్పంచ్ ఇందూరి సునీత చంద్రశేఖర్

 

రుద్రూర్, బతుకమ్మ :

 

మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా ఎదగాలని గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు, మహిళా వార్డు మెంబర్లకు, గ్రామ పంచాయతీ కార్మికురాలులకు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అమూల్యమైనదన్నారు. మహిళల శక్తి, త్యాగం, ప్రేమ, పట్టుదల స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.