Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 October 2024, 5:30 pm Posted by : ramakrishna

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

బతుకమ్మ భిక్కనూరు: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా మహిళా సాధికారత కేంద్ర కోఆర్డినేటర్ శిరీష, ఫైనాన్షియల్ లిట్రసీ సౌందర్య తెలియజేశారు. మండలంలోని కాచాపూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రోజు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాలలో ముందుండాలని వారు తెలియజేశారు. స్త్రీలకు సంబంధించిన చట్టాలు, ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, హెల్ప్ లైన్ నెంబర్లు విద్యార్థులకు తెలియజేశారు. ఆడపిల్లలు ధైర్యంగా ముందుకెళ్లాలని ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.