Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 7:49 pm Posted by : ramakrishna

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

మహిళలు విద్యాపరంగా సాధికారత సాధించాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పెద్దన్న అన్నారు. అన్ని రంగాలలో ముందుకెళ్లాలని విద్యార్థులను ప్రోత్సహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో పని చేస్తున్న మహిళ సిబ్బందిని ప్రిన్సిపాల్ సమక్షంలో శాలువాలతో ఘనంగా సన్మానించి అనంతరం కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ బ్యూలా, అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.