Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 5:37 pm Posted by : ramakrishna

మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి

వేల్పూర్, బతుకమ్మ :

 

మహిళలు స్థానిక అవసరాలను గుర్తించి చిన్న తరహా వ్యాపారాలు చేస్తూ వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఏపీఎం బత్తుల మాణిక్యం అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ధనలక్ష్మి గ్రామ సంఘం పరిధిలోని కొమురెల్లి మల్లన్న స్వయం సహాయక సంఘం సభ్యురాలు అయినటువంటి రాజశ్రీ వెంకటేశ్వర స్వగృహ ఫుడ్స్ ఎంటర్ ప్రైజెస్ ని మండల సమాఖ్య అధ్యక్షురాలు సరోజా ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాపారాలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసి వాటికి అవసరమయ్యే రుణాలు ఐకెపి ద్వారా పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు సరోజిని, ఏపిఎం బత్తుల మాణిక్యం, సిసి లు వెన్న మురళి, సాయన్న,సరళ, లక్ష్మీ, సునీత, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు రాజశ్రీ, వివొఏ కావ్య, లావణ్య, మాధురి, మానస, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.