మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బాన్సువాడ, బతుకమ్మ : పెరుగుతున్న పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. మగవారికి ధీటుగా వివిధ రంగాలలో పోటీ పడాలని సూచించారు. బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ మహిళలు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో మగవారితో ధీటుగా పోటీ పడాలని సూచించారు. ప్రతి ఆడపిల్లకు తప్పనిసరిగా...