మహిళలు స్వయంశక్తి సాధించాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతి మహిళా అఘాయిత్యాలకు లోనుకాకుండా స్వయంశక్తి సాధించాలని, హింసకు గురైనప్పుడు గృహహింస చట్టం ద్వారా మహిళలకు కావాల్సిన రక్షణ, మనోవృత్తి పొందవచ్చునని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ పద్మావతి అన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పురోగతి వైపు బాటలు వేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్సపల్లి లోని కురుమ సంఘం భవన్ లో మహిళా దినోత్సవ...