Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 6:37 pm Posted by : ramakrishna

మహిళలు వివిధ రంగాల్లో విశేషమైన పాత్ర పోషిస్తున్నారు

 

. . . ఆర్పి హాస్పిటల్ చైర్మన్ బొద్దుల రాజేంద్రప్రసాద్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

మహిళలు ఆరోగ్యం, విద్య, సేవా రంగాల్లో విశేషమైన పాత్ర పోషిస్తున్నారని ఆర్పి హాస్పిటల్ చైర్మన్ బొద్దుల రాజేంద్రప్రసాద్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ బొద్దుల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో వైద్యులు, మహిళా సిబ్బంది, ఇతర స్టాఫ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మహిళల సేవలను, సమాజ నిర్మాణంలో వారి పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా ప్రధాన శక్తిగా నిలుస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని, మహిళలు ముందుకు వస్తే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. డాక్టర్ వనిత మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరమని పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు ఆరోగ్యాన్ని కూడా మహిళలు కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

Women play a significant role in various fields.

 

. . . ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ

నగరంలోని కోటగల్లి ప్రాంతంలో ఉన్న పద్మశాలి సంఘం తర్ప నెం.3 ప్రాంగణంలో ఆర్‌పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డా. బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఆర్‌పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన అనుభవజ్ఞులైన కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ వనిత రోగులకు సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సలహాలు అందించారు. ఈ సందర్భంగా డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కోటగల్లిలోని బంగారు మైసమ్మ మందిరం ఎదురుగా నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం కావడంతో స్థానిక ప్రజలు, పద్మశాలి సంఘం సభ్యులు నిర్వాహకులను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరారు.

 

Women play a significant role in various fields.