Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 6:51 pm Posted by : ramakrishna

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి రాఖీ కట్టిన మహిళా నేతలు

 

హైదరాబాద్, బతుకమ్మ : 

 

​బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకి పార్టీ మహిళా నేతలు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత వారిద్దరినీ ఆత్మీయంగా పలకరించి ఆశీర్వదించారు. వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ కట్టిన మహిళా నేతలిద్దరినీ కేసీఆర్ దంపతులు చీర సారెతో సత్కరించి దీవించారు.