సావిత్రిబాయి పూలే అవార్డులు పొందిన మహిళలకు సన్మానం
నిజామాబాద్, బతుకమ్మ : సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి అవార్డులు పొందిన జిల్లాకు చెందిన మహిళలు బగ్గలి స్వప్న రజక, సురుకుట్ల ఝాన్సీ లను సోమవారం నగరంలోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయం లో నిజామాబాద్ బీసీ మహిళ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు శ్రీలత మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఏ రంగంలో అయినా రాణించే మహిళలకు తమ సంఘం పూర్తిగా మద్దతుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వాసంజయ, రేఖ, రుక్మిణి, అపర్ణ, నరాల సుధాకర్...