Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 June 2025, 6:16 pm Posted by : ramakrishna

ప్రజా ప్రభుత్వంలో మహిళకే పెద్దపీట

  • మహిళలను కోటీశ్వర్లు  చేయడమే ప్రభుత్వ ధ్యేయం
  • రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి 

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : మహిళలను కోటీశ్వర్లు గా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు.  నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం  క్యాంపు కార్యాలయంలో మంగళవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్  చెక్కులను  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం  మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి మహిళా కోటీశ్వరులుగా చేయాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్నారని అన్నారు. 70 లక్షల మంది డ్రాక్వా  గ్రూపులలో ఉన్నారని , వారికి రుణాలు ఇచ్చి, సోలార్ వంటి ప్లాంట్లను వ్యాపారం చేయడానికి ప్రోత్సహిస్తున్నమని అన్నారు. మహిళ లు బస్సులు కొనుక్కొని  ఆర్టీసీలో అద్దెకు ఇవ్వాలని రుణాలు ఇస్తున్నామని అన్నారు. ఇందిరా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. మొత్తం 281 చెక్కలు మండల వారీగా సిరికొండ మండలం 44 చెక్కులు,ధర్పల్లి మండలం 73 చెక్కులు, డిచ్పల్లి మండలం 31 చెక్కులు,మోపాల మండలం 40 చెక్కులు,నిజామాబాద్ రూరల్ మండలం 49 చెక్కులు 2 కోట్ల 80 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలికేట్ శేఖర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, యువజన నాయకులు ఉమ్మాజీ నరేష్,కాంగ్రెస్  పార్టీ మండల అధ్యక్షులు బాలాజీ,సాయి రెడ్డి, అమృతపూర్ గంగాధర్,నవీన్ గౌడ్,పి ఎ సి ఎస్ చైర్మన్లు గోవర్ధన్, శ్రీనివాస్, శ్రీధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాసుబాబు, శాంసన్, రాజేంద్రప్రసాద్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, చెక్కుల లబ్ధిదారులు  తదితరులు పాల్గొన్నారు.

Women have a prominent place in public government.