Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 November 2025, 1:10 pm Posted by : ramakrishna

మహిళా డీఎస్పీలు ఆదర్శంగా నిలవాలి

హైదరాబాద్, బతుకమ్మ : పోలీస్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల మనసులు గెలచుకోవాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. మహిళా డీఎస్పీలు వచ్చే  తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. గ్రూప్-1 ద్వారా ఎంపికైన డీఎస్పీలకు హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈకార్యక్రమానికి డీజీపీ హాజరయ్యారు. మొత్తం 112 మందికి శిక్షణ ప్రారంభిస్తున్నామని, ఇప్పటి వరకు ఇదే అతిపెద్దబ్యాచ్ అని అన్నారు. అకాడమి డైరెక్టర్ అభిలాష బిస్త్ ఉన్నారు.