Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 March 2025, 7:11 pm Posted by : ramakrishna

అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు

బతుకమ్మ,మోర్తాడ్: నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలరాణి అన్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఉపాధ్యాయురాలను, లెక్చర్లను, కానిస్టేబుల్ అని, సీఆర్పీలను తదితర మహిళలను శాలువలతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో పద్మావతి, లత, లహరిక, సాగరిక, పద్మ, సిఆర్పి పరిమళ, కానిస్టేబుల్ రమ్య, లెక్చరర్ అర్చన తదితరులు పాల్గొన్నారు.

Women are excelling in all fields.