Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 March 2025, 4:30 pm Posted by : ramakrishna

అన్ని రంగాల్లో మహిళలు ముందంజ

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. మహిళలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. పెద్దన్న అన్నారు. రాష్ట్రపతి ద్రౌపతి మురుము, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖాగుప్త, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, అంతరిక్ష యాతికురాలు సునీత విలియం, అమెరికా అధ్యక్ష పదవికి పోరాటం చేసిన కమల హరీష్ వంటి వారందరూ స్త్రీలు మార్గ దర్శకులని పేర్కొన్నారు. అనంతరం కళాశాలలోని మహిళా సిబ్బంది, మహిళా ఉద్యోగులు అందరూ కలిసి కేక్ కట్ చేసి సంబరం చేసుకున్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మర్రిపల్లి భూపతి, అకాడమిక్ కోఆర్డినేటర్ దశరథ్, బ్యూల, మహిళా ఉద్యోగులు, మహిళ సిబ్బంది, విద్యార్థి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Women are at the forefront in all fields