Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 10:35 pm Posted by : ramakrishna

మహిళా మృతదేహం లభ్యం

ఎడపల్లి, బతుకమ్మ : ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామానికి చెందిన బోదసు దేవమ్మ(60)అనే మహిళ సోమవారం స్థానిక అశోక్ సాగర్ చెరువులో శవమై తేలింది. ఎస్ఐ.వంశీకృష్ణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 26 న సాయంత్రం దేవమ్మ కాలకృత్యాలు తీర్చుకోవడానికని ఇంటి నుంచి వెల్లి తిరిగి ఇంటికి రాలేదని మృతురాలు కొడుకు బోదాసు మల్లేష్ తెలిపాడు.కుటుంబ సభ్యులందరు అన్ని చోట్ల వెతుకగా ఎక్కడ కూడా ఆచూకీ లభ్యం కాలేదని అన్నారు.సోమవారం ఉదయం అశోక్ సాగర్ చెరువు తూము వద్ద గుర్తు తెలియని మహిళా మృత దేహం ఉందని స్థానికులు తెలుపగ వెంటనే వెళ్లి చూడగా శవము  తమ తల్లిదే అని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని వెలికితీసి పంచనామ నిర్వహించి పోస్టు మార్టం నిమిత్తం బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొడుకు మల్లేష్ ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.