మహిళ మృతికి కారణమైన మహిళకు పదేళ్ల జైలు
నిజామాబాద్,బతుకమ్మ : మహిళ మృతికి కారణమైన మరో మహిళలకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 10,000 జరిమానా విధిస్తూ మహిళపై అత్యాచారాల నేర విచారణ న్యాయస్థానం నిజామాబాద్ స్పెషల్ జడ్జి హరీష గురువారం తీర్పు వెలువరించారు. మరో ఇద్దరిపై మహిళపై అత్యాచార నేర నిరూపణ కానందున నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. వివరాలు ఇలా.. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బెల్య నాయక్ తండాకు చెందిన హలవత్ కమల కు కల్లు తాగే అలవాటు ఉంది.ఆర్థిక అవసరాల కోసం ఆమె...