నిజాంసాగర్, బతుకమ్మ : ఓరి దేవుడా! ఇలాగా కూడా దొంగతనం చేస్తారా! ఒక మహిళ ఆటో కోసం ఎదురుచూస్తుండగా ఓ ఆటో డ్రైవర్ వచ్చి ఆటోలో దింపేస్తా అని మాయ మాటలు చెప్పి ఆ మహిళను ఆటోలో ఎక్కించుకొని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి రెండు తులాల బంగారు ఆభరణాలను, 20 తులాల వెండి వస్తువులను ఎత్తుకెళ్లిన ఘటన ఇప్పుడు మండలంలో కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఆటో స్టాండ్ లో ఓ మహిళ తన కూతురును చూసేందుకు అచ్చంపేట్ గ్రామానికి వెళ్లడానికి ఆటో కోసం ఎదురు చూస్తుంది. ఆమె ఒంటరిగా ఉన్నరని పసిగట్టిన ఓ చోరీ ఆటో డ్రైవర్ ఆమె దగ్గరికి వచ్చి అచ్చంపేటకు వెళ్తున్నానని దింపేస్తానంటూ నమ్మబలికాడు. ఆమెను ఆటోలో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె మెడలో నుండి రెండు తులాల బంగారం గొలుసు, తులాల వెండి లను బెదిరించి చోరీ చేశాడు. బాధితురాలు నిజాంసాగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.