సహజీవనం చేయడం లేదని మహిళ హత్య
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తనతో ఐదు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న మహిళ ఆ సంబంధాన్ని కొనసాగించడానికి నిరాకరించడంతో ప్రియుడే ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ నెల 6న నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని రైల్వే కంపౌండ్ లో వెలుగు చూసిన గుర్తు తెలియని మహిళ డేడ్ బాడీ కేసును మర్డర్ కేసుగా విచారణ చేయడంతో సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి కథనం...