ఇంటి నుంచి బిడ్డతో వెళ్లిపోయిన మహిళ

  . . . మెరుపువేగంతో స్పందించిన దోమకొండ పోలీసులు దోమకొండ, బతుకమ్మ : కుటుంబ కలహాలతో ఓ మహిళ తన బిడ్డతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు డయల్ 112కు సమాచారం అందించడంతో పెట్రోకార్ సిబ్బంది సాయిబాబా, హోంగార్డు రాజులు రంగంలోకి దిగారు. మహిళను చెరువు వద్ద గుర్తించి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబానికి సురక్షితంగా అప్పగించారు. ఒక్క ఫోన్ కాల్ తో రెండు ప్రాణాలను పోలీసులు సురక్షితంగా కాపాడడంతో కుటుంబ సభ్యులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు....