- నిందితుడి ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన వైనం
- హత్య చేసిన మరో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు
- బంగారు నగలు, బైక్ స్వాధీనం
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో గడిచిన వారం జరిగిన మహిళ హత్య కేసును చేదించనట్లు కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్ రావు లిపారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం కంచర్ల గ్రామ శివారులో సుగుణ అనే మహిళ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ నెల 20న సుగుణ తన వ్యవసాయ క్షేత్రంలో హత్యకు గురికాగా హత్యలో పాల్గొన్న బీబీపేట్ మండలం యాడారంకు చెందిన అల్లెపు మల్లయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు ఆసుపత్రిలో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా యాడారం గ్రామానికి చెందిన ముగ్గురు నవీన్, ప్రసాద్, సాలవ్వలను అరెస్టు చేసినట్లు తెలిపారు. సుగుణ ఒంటిపై ఉన్న బంగారు నగల కోసమే ఈ హత్య జరిగిందని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి మూడు తులాల బంగారు నగలు, బైస్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
