Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 August 2025, 12:52 pm Posted by : ramakrishna

పొలంలో పని చేస్తుండగా పాము కాటుతో మహిళ మృతి

మహ్మద్ నగర్ మండలంలో విషాదం

కామారెడ్డి, బతుకమ్మ : పొలంలో పని చేస్తుండగా పాము కాటుతో మహిళ మృతి చెందింది. ఈఘటన కామారెడ్డి జిల్లా  మహ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి తండాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. తండాకు చెందిన కోల మమత (32), సోమవారం సాయంత్రం పొలానికి నీళ్లు కట్టేందుకు వెళ్లింది.అదే సమయంలో మమతను పాము కాటు వేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యుల వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందింది. పాము కాటు వేసిన సమయంలో ఆమె ఒంటరిగా ఉండటంతో, ఏ పాము కాటు వేసిందో ఎవరికీ తెలియలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతురాలికి ఏడేళ్ల పాప, ఐదేళ్ల బాబు ఉన్నారు. ఈఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.