వెన్ను నొప్పికి సర్జరీ.. మహిళ మృతి
. నిజామాబాద్ నగరంలోని ప్రతిభ ఆస్పత్రిలో ఘటన . వైద్యల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి భర్త ఆరోపణ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: వెన్ను నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన మహిళ వైద్యులు ఆపరేషన్ చేసిన తరువాత కన్నుమూసింది. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని ప్రతిభ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. వేల్పూర్ మండలం పడిగల్ గ్రామానికి చెందిన రాధిక(35) వెన్ను నొప్పితో బాధపడడంతో ఆమెను భర్త సురేశ్.. ప్రతిభ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. రాధికకు వెన్నుపూస ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలపడంతో...