పూల నిమజ్జనానికి వెళ్లి చెరువులో పడి మహిళ మృతి
నందిపేట, బతుకమ్మ : పూజా పూలను నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన నందిపేట మండల కేంద్రంలోని రాంనగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి నందిపేట ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాంనగర్‌కు చెందిన పీ. సుజాత (50) బుధవారం ఉదయం ఇంట్లో పూజా కార్యక్రమం ముగించుకుని, పూలను రఘునాథ చెరువులో నిమజ్జనం చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో ఆమె భర్త గంగాధర్ పని నిమిత్తం బయటకు వెళ్లారు....