రైలులో నుంచి పడి మహిళ మృతి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: రైలులో నుంచి పడి గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. ఈ ఘటన సిర్నాపల్లి – ఉప్పల్ వాయి రైల్వే స్టేషన్ ల మధ్య చోటుచేసుకుంది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ సమాచారం అందించగా ఘటనాస్థలాన్ని రైల్వే ఎస్సై తావూనాయక్ పరిశీలించారు. మృత దేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని ఎస్సై తెలిపారు. మృత దేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించామని, మృతురాలి సంబంధీకులు ఎవరైనా ఉంటే 87126 58591 నంబర్ ను సంప్రదించాలని ఆయన సూచించారు.