బతుకమ్మ, మాచారెడ్డి: అంగవైకల్యం తో జీవితం ఇంత కాలం వెల్లదీసింది చాలు అని విరక్తి చెంది ఆత్మహత్యా యత్నం చేసిన గిరిజన మహిళ చికిత్స పొందుతూ మూడు రోజుల కు మృతి చెందిన ఘటన మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బానోత్ పద్మ (43) ఈనెల 15న రాత్రి 9 గంటల సమయంలో తన అంగవైకల్యానికి తోడు తన కాలు విరిగినందున ఎప్పుడూ బాధపడుతూ జీవితం గడపడం అవసరమా అని మానసిక ఒత్తిడి కి గురవుతుండేది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలకల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో తుది శ్వాస విడిచింది. తల్లి బానోత్ గంగవ్వ ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు.