చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

బతుకమ్మ ,పిట్లం : పిట్లం గ్రామానికి చెందిన మందడి బషవ్వ మంగళవారం  చెరువులో దూకి మహిళా ఆత్మహత్య చేసుకున్నట్లు పిట్లం ఎస్సై రాజు తెలిపారు. వివరాలకు వెళ్తే  బషవ్వ  కొంత కాలం నుండి ఆస్తమా రోగంతో బాధపడుతుంది. గత ఒక సంవత్సరం క్రితం ఆమె తల్లి మరణించగా మానసికంగా కృంగిపోయింది. జీవితంపై విరక్తి చెంది ఊర చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి అన్న  మందడి గంగారాం పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.   మృతదేహాన్ని బాన్సువాడ ఏ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం...