ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి మండలం రుద్రవరం గ్రామానికి చెందిన షేర్ల భావన గత నెల 26 న ఇంస్టాగ్రామ్ లో ఒక డ్రెస్ చూసి దాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. గత నెల 30 డ్రెస్ విషయమై ఒక గుర్తు తెలియని వ్యక్తి భావనకు ఫోన్ చేసి మీ డ్రెస్ ను మేము పంపిస్తున్నాము కానీ అటు డ్రెస్ పై ట్యాక్స్ ఉంది అంటూ డబ్బులు చెల్లిస్తే తిరిగి మీ డబ్బులు మీకు వస్తాయి అని చెప్పడంతో ఆమె నమ్మి అట్టి గుర్తు తెలియని వ్యక్తికి 40,118 రూపాయలను పంపింది. అయినా కూడా ఆ వ్యక్తి మరిన్ని డబ్బులు పంపు అంటూ వేధించడంతో మోసపోయాను అని గ్రహించి ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.ఫిర్యాదురాలు వెంటనే సైబర్ టోల్ ఫ్రీ నంబర్ 1930 కి ఫోన్ చేయడంతో 16000 రూపాయలు హోల్డ్ లో పడినాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే నమ్మి ఓటీపీ లు చెప్పి మోసపోవద్దని పోలీసులు సూచించారు.