Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2025, 9:28 pm Posted by : ramakrishna

పాంగ్రాలో మహిళ దారుణ హత్య

  • ఆలస్యంగా వెలుగు లోకి

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నిజామాబాద్ నగరంలోని పాంగ్రా( బి)లో చారుగోండ చంద్రకళ (50) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. గుర్తు తెలియని వ్యక్తులు చంద్రకళను గోంతుకోసి చంపినట్లు గుర్తించారు. భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న చంద్రకళ ఐదురోజుల క్రితం తన ఇంటిలోనే హత్యకు గురి కావడంతో ఇంటినుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బీడి కార్మికురాలిగా పనిచేసుకుంటు జీవించే చంద్రకళను హత్య చేసే అవసరం ఎవరికి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రకళ హత్యకు గురైనప్పుడు వివస్త్రగా ఉండటంతో  అఘాయిత్యం జరిపి, గొంతు కోసి చంపారంటే తెలిసిన వారి పనే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి ధర్యప్తు చేస్తున్నట్టు నగర సిఐ శ్రీనివాస రాజు తెలిపారు.