ఫకీరాబాద్ శివారులో మహిళా దారుణ హత్య
నవీపేట్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. దారుణంగా తల నరికివేసి మొండెం ను వేరు చేశారు. ఈ ఘటన శనివారం ఉదయం వెలుగుచూసింది. నవీపేట్ మండలంలోని ఫకీరాబాద్ నుంచి మిట్టాపూర్ వెళ్లి దారిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళను వివస్త్రను చేసి దారుణంగా హతమార్చారు. ఆమె శరీరం నుంచి తలను వేరు చేశారు. మొండాన్ని ఆక్కడ పడేశారు. ఆమె చేయిని సైతం మణికట్టు...