Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 November 2025, 11:43 am Posted by : ramakrishna

ఫకీరాబాద్ శివారులో మహిళా దారుణ హత్య

నవీపేట్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. దారుణంగా తల నరికివేసి మొండెం ను వేరు చేశారు. ఈ ఘటన శనివారం ఉదయం వెలుగుచూసింది. నవీపేట్ మండలంలోని ఫకీరాబాద్ నుంచి మిట్టాపూర్​ వెళ్లి దారిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళను వివస్త్రను చేసి దారుణంగా హతమార్చారు. ఆమె శరీరం నుంచి తలను వేరు చేశారు. మొండాన్ని ఆక్కడ పడేశారు. ఆమె చేయిని సైతం మణికట్టు వరకు నరికి వేశారు. తెలిసిన వారు మహిళను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువచ్చి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం సమాచారం అందుకున్న నవీపేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీపీ సాయి చైతన్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా నవీపేట్ మండలం నాగేపూర్ లో మహిళ హత్య కేసు ఇంకా కొలిక్కి రాకముందే మరో మహిళ ను దారుణంగా హత్య చేయడం కలకలం రేపుతుంది. నెల రోజుల వ్యవధిలో నవీపేట్ మండలంలో మూడు హత్యలు జరిగాయి. మూడు కేసులు విచారణలో ఉండగానే జరుగుతున్న వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్ర నిర్మల్ జిల్లా సరిహద్దులు గా ఉండటం తో నేరాలు పెరిగాయి. మహిళ ఆచూకీ తెలిస్తే గాని హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగే అవకాశాలు లేవు. పోలీసులు మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నారు.