సెల్ఫీ వీడియో తీసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం
ఇందల్వాయి, బతుకమ్మ : మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన బుధవారం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి మండలం తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన చిన్న సంధ్యారాణి తన భూమిని మూడేళ్ల క్రితం బీఆర్ఎస్ నాయకుడికి విక్రయించింది. ఈ క్రమంలో ఆయన కొంత డబ్బు చెల్లించాడు. మూడేళ్లు గడుస్తున్నా మిగతా డబ్బుల ఇయ్యలేదు. మూడేళ్లుగా డబ్బులు అడుగుతున్నా పట్టించుకోలేదు. బాధితురాలు బుధవారం ఆయన ఇంటికి వెళ్లి డబ్బుల కోసం...