Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 May 2025, 3:51 pm Posted by : ramakrishna

చోరీ కేసుల్లో మహిళ అరెస్ట్

ఎల్లారెడ్డి, బతుకమ్మ: మూడు చోరీ కేసుల్లో ఓ మహిళను ఎల్లారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రవీందర్ నాయక్ కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నీరడి మంజుల(45) అనే మహిళ వేర్వేరు చోట్ల చోరీలకు పాల్పడింది. ఈ క్రమంలో చోరీ చేసిన నగదలను పట్టణంలోని డెయిలీ మార్కెట్ వద్ద విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకుని విచారించగా చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకుంది. కేసు నమోదు చేసి నిందితురాలిని రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.