దొంగతనం కేసులో మహిళా అరెస్ట్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా దొంగను శనివారం అరెస్ట్ చేసినట్లు నార్త్ రూరల్ సీఐ బి.శ్రీనివాస్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ నెల 17న బింగి సరేష్ అనే బాధితుడు తన ఇంట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 7గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.8వేల నగదు దొంగిలించారని మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా అతని ఇంటి పక్క ఇంటిలో నివాసం ఉండే మహిళ...