Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 7:25 pm Posted by : ramakrishna

దొంగతనం కేసులో మహిళా అరెస్ట్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా దొంగను శనివారం అరెస్ట్ చేసినట్లు నార్త్ రూరల్ సీఐ బి.శ్రీనివాస్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ నెల 17న బింగి సరేష్ అనే బాధితుడు తన ఇంట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 7గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.8వేల నగదు దొంగిలించారని మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా అతని ఇంటి పక్క ఇంటిలో నివాసం ఉండే మహిళ అయినా చాకలి జ్యోతి పై అనుమానం వ్యక్తం చేయగా అట్టి మహిళను మహిళా పోలీసుల సమక్షంలో విచారణ చేశారు. ఆమె ఫిర్యాదు దారి ఇంట్లో దొంగతనం చేసిన విషయం ఒప్పుకున్నది. అంతేకాకుండా సుమారు నెల రోజుల క్రితం వారి ఇంటి పక్క వారి ఇంటి పక్కనే ఉండే కటికే శారద ఇంట్లో కూడా దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. రెండు దొంగతనాలకు సంబంధించి ఐదు తులాల ఏడు గ్రాముల బంగారం, 3000 రూపాయలు మహిళా నేరస్థురాలు ఇంటిలో నుండి స్వాధీనం చేసుకున్నారు. మహిళా నేరస్థరాలని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. కేసును త్వరితగతిన చెదించడంలో ప్రతిభ కనబరిచిన  మాక్లూర్ ఎస్సై, సిబ్బంది రాజేశ్వర్, వరప్రసాద్, రాకేష్ మరియు మహిళా సిబ్బంది రచిత, లక్ష్మి ప్రసన్న లను అభినందించారు.