Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 May 2025, 1:05 pm Posted by : ramakrishna

శ్రామికులు లేకపోతే దేశ నిర్మాణం లేదు

ఉపాధి కూలీలను ’ఉపాధి శ్రామికులు‘ గా పిలుస్తాం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

మంగళగిరి, బతుకమ్మ : శ్రామికులే లేకపోతే దేశ నిర్మాణం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గురువాం మే డే సందర్భంగా మంగళగిరిలో శ్రామికులతో పవన్ ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు. కార్మిక దినోత్సవం నుంచి కూలీలు కాదు ఉపాధి శ్రామికులు అని పిలుస్తామన్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా అవసరమన్నారు. ఉపాధి శ్రామికుడు పని ప్రదేశంలో మరణిస్తే చెల్లించే రూ.50 వేలు ఇప్పుడు రూ. 2లక్షలకు పెంచమన్నారు. ఎండాకాలం ఉదయం 11 లోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. శ్రామికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఉపాధి శ్రామికులకు రూ. 3లక్షల నుంచి రూ. 30 లక్షల ఉచిత ప్రమాద బీమా ఇవ్వడానికి ఎస్బీఐతో ఒప్పందం చేసుకున్నామన్నారు.