ఎండుతున్న పంటలు.. నెర్రెలుపారుతున్న భూములు

. ఆందోళనలతో అన్నదాత . పలుచోట్ల పశువులకు మేతగా మారుతున్న వరి నిజామాబాద్, బతుకమ్మ  : నెర్రెలుపారుతున్న భూమి.. కళ్ల ముందే ఎండుతున్న పొలాలు.. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట పశువులకు మేతగా మారిన దృశ్యాలను చూస్తూ రైతు గుండె తల్లడిల్లుతోంది. ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. వేసవికి ముందే కరువు చాయలు అలుముకుంటున్నాయి. బోర్లు ఎత్తిపోతున్నాయి. కొత్తవి తవ్వినా నీటి చుక్క జాడ లేక అన్నదాతకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఎన్నో ఆశలతో సాగు చేసిన...