Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 February 2025, 7:26 pm Posted by : ramakrishna

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ 

  • 12 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు
  • ఒక్కరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి

 

నిజామాబాద్, బతుకమ్మ : మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల,ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు వేసిన 13 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో 12 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కాగా ఒక్కరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలకు విత్ డ్రా చేసుకున్నవారిలో  గవ్వల లక్ష్మి, ఎడ్ల సాయి కృష్ణప్రియ, కావూరి సత్యనారాయణ గౌడ్, ఆలగొండ కృష్ణ హరి,నాలకంటి యాదగిరి,బడే నరసయ్య ,లింగాల శ్రీనివాస్, రేకల సైదులు,మదనం గంగాధర్, లింగం కృష్ణ, సోమగాని నరేందర్,దార మనోహర్ లు కాగా టీచర్స్ ఎమ్మెల్సీకి గవ్వల శ్రీకాంత్ నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు.