Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 7:59 pm Posted by : ramakrishna

పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఏ మొఖం పెట్టుకుని తిరుగుతున్నాడు

 

. . . సుదర్శన్ రెడ్డికి ఏజ్ పెరిగినా అకల్ పెరుగుతలేదు

 

. . . ఆర్వోబి పనులకు నిధుల విడుదల జాప్యంపై ఎంపీ అర్వింద్ ఫైర్

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా ప్రజల మూడు దశాబ్ధాల కల నెరవేర్చేందుకు 2014లో సాంక్షన్ అయిన మాదవనగర్ ఆర్వోబి పనులకు నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంపై జిల్లా నేతలపై ఎంపీ అర్వింద్ ధర్మపురి ఫైర్ అయ్యారు. శుక్రవారం సాయంత్రం మాదవనగర్ ఆర్వోబి వద్ద ఆయన నత్తనడకన నడుస్తున్న పనులను చూసి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఏ మొఖం పెట్టుకుని ఈ రోడ్డుపై తిరుగుతున్నాడని మండిపడ్డారు. జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి ఏజ్ పెరిగిన అకల్ పెరుగలేదని, లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అయినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్సపల్లి, జానకంపేట్ ఆర్వోబిలు వంద శాతం రైల్వే నిధులతో చకచక పనులు జరుగుతుంటే 2014లో ప్రారంభమైన మాదవనగర్ రైల్వే బ్రిడ్జి నిధులకు గ్రహణం పట్టిందన్నారు. రైల్వే శాఖ ఇప్పటికే తన వంతుగా నిధులు ఇచ్చినా రాష్ట్రం నుంచి రూ.3 కోట్ల నిధులు పెండింగ్ లో ఉండడం వల్ల పనులు జరుగతలేవన్నారు. తాము ఒక్క రూపాయి లంచం అడుగడం లేదని, రాష్ట్రంలో మాత్రం ఫైనాన్స్ మినిస్టర్ ఇతర అధికారులు కమిషన్ ఇస్తే గానీ నిధులు ఇవ్వడం లేదని అందుకు మాదవనగర్ ఆర్వోబి నిదర్శనమన్నారు. 2022 అక్టోబర్ ఈఎన్ సీ కొత్త ప్లాన్ ప్రకారం అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన రెండు సంవత్సరాలలో ఇప్పటికి అనుమతులు ఇవ్వకపోవడం కాంగ్రెస్ నేతల చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు విడుదల చేయక అడ్డుకుంటే తాను కేంద్ర మంత్రిత్వ శాఖ అనుమతులు ఇప్పించామని గుర్తు చేశారు. తాను ఎంపీగా ఉన్న ప్రేమ కావచ్చు, శీనన్న కొడుకుగా అభిమానంతో ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చిందని కానీ మూడు కోట్ల నిధుల కోసం పనులు ఆగిపోవడం బాధ కలిగించిందన్నారు. ప్రభుత్వం వెంటనే మాదవనగర్ ఆర్వోబికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 

With what face is PCC President Mahesh Kumar Goud going around?