ఇవాళ్టితో ధరణి అనే దరిద్రం పోయింది
వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ నిజామాబాద్, బతుకమ్మ : ఇవాళ్టితో ధరణి అనే దరిద్రం పోయిందని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. రైతులు ధరణి పోర్టల్ తో చాలా ఇబ్బంది పడ్డారని అన్నారు. భూములు వున్నా పాస్ బుక్ లు రాక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారని తెలిపారు. కొందరైతే రైతులు గుండె ఆగి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులకు ధరణి వరంగా మారిందని పేర్కొన్నారు. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను తీసేసి కేసీఆర్...