డిప్యూటేషన్ రద్దుతో వివాదం సద్దుమనిగినట్లేనా
ఫిర్యాదులపై విచారణ ఏది వ్యవసాయ శాఖలో అంతులేని అవినీతి డిజిటల్ క్రాఫ్ సర్వే నేపథ్యంలో అవినీతి వెలుగులోకి నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ వ్యవసాయ శాఖ అవినీతి పుట్టలు పగులుతున్నాయి. అప్పటి వరకు వ్యవసాయ శాఖలో అంతా సవ్యంగా ఉందని అనుకుంటున్న తరుణంలో నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో)లు తాము డిజిటిల్ క్రాఫ్ సర్వే చేయమని మొండికేయడంతో అవినీతి, అక్రమాల వ్యవహరాలు వెలుగులోకి వచ్చాయి. ఏఈవోలు తాము సర్వే చేయమంటే అవినీతి ఎలా బహిర్గతమౌతుందన్న ప్రశ్న తలెత్తవచ్చు. ఏఈవోలు కచ్చితంగా వ్యవసాయ శాఖ కమిషనర్...