Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 November 2024, 5:22 pm Posted by : ramakrishna

కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతిని విజయవంతం చేయండి 

  •  ముదిరాజ్ మహాసభ పిలుపు

బతుకమ్మ మాచారెడ్డి:  తెలంగాణ మలి దశ పోరాట తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య  15వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని  ముదిరాజ్ మహాసభ  కామారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.  డిసెంబర్ 1న  కూడళ్లలో,  అమరవీరుల స్తూపాల వద్ద ఉదయం 11 గంటలకు అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కు ఘనంగా నివాళు ఆర్పించాలని కోరారు. ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, సంఘం అధ్యక్షులు కార్యవర్గం ప్రజా సంఘాల ఉద్యమ సంఘాల నాయకులు, ముదిరాజ్ లు హాజరై ఘనంగా నివాళులర్పించాలని కోరారు.