Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 7:41 pm Posted by : ramakrishna

మా కన్నీటిని తుడవండి సార్…

 

. . . వేల్పూర్ మండల కేంద్ర వీవోఏల ఆవేదన

 

వేల్పూర్, బతుకమ్మ :

 

గ్రామ సంఘాలను ఏర్పాటు చేసి ప్రతి మహిళ ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తూ సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పడుతున్న ఆర్థిక ఇబ్బందులను, కష్టాలను చూసి మా కన్నీళ్లను తుడ వండి అంటూ వేల్పూర్ మండలం కేంద్రంలోని వివోఏలు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మంత్రి సీతక్క ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసి, మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు టెంట్ వేసి సమ్మె లో పాల్గొన్నారు. అలాగే అభివృద్ధికి వీవోఏ లకు కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని, ఎస్ఈఆర్ పి ఉద్యోగులుగా గుర్తించి హెచ్ ఆర్ పాలసీ వర్తింపజేయాలని, అర్హులైన వీవోఏ లను సీసీ లుగా పదోన్నతి కల్పించాలన్నారు. 4 వీవోఏ లకు సాధారణ & ఆరోగ్య భీమా సౌకర్యం రూ.20 లక్షల వరకు కల్పించాలన్నారు. టాబ్ & నెట్ సౌకర్యం కల్పించాలని, జీవో 58  సవరించాలని తమ డిమాండ్లను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల వివో ఏలు, తదితరులు పాల్గొన్నారు.