Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 7:03 pm Posted by : ramakrishna

జిల్లా కోర్టు ప్రాంగణంలో చలివేంద్రం ప్రారంభం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా జడ్జి భరత లక్ష్మీ సోమవారం ఉదయం చలి వేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు వేసవిలో పట్టెడు అన్నం కన్న గుటికెడు నీళ్లు మంచిదని జిల్లా నలుమూల నుండి కోర్ట్ కు కక్షిదారులు వస్తారని అందుకే జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా చలి వేంద్రం ఏర్పాటు చేసామని అన్నారు. ఇక్కడకు వచ్చే వారు అందరు సద్వినియోగ పరచుకోవాలని అన్నారు. ఈ కార్య క్రమం లో కుటుంబ కోర్ట్ జడ్జీ అశాలత, రెండవ అదనపు జిల్లా కోర్టు జడ్జి శ్రీనివాస్, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఉదయ్ భాస్కర్ రావు, జూనియర్ సివిల్ జడ్జి గోపి కృష్ణ మేజిస్ట్రేట్ లు కుష్బూ ఉపాధ్యాయ, శ్రీనివాస్ రావు,హరికుమార్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం. సాయ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు.జి.పి.అమిదల సుదర్శన్ సీనియర్ జూనియర్ న్యాయ వాదులు కాక్షి దారులు న్యాయ సేవా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.