గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవాలి
తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రీడాల్లో ప్రోత్సహించాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బతుకమ్మ, భీమ్ గల్ : క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోని ముందుకు వెళ్లాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఉద్బోదించారు. ఆదివారం భీమ్ గల్ మండల కేంద్రంలోని కృషి హైస్కూల్ స్టేడియం లో నిర్వహించిన ఎస్ జీ ఎఫ్ మండల అంతర్ పాఠశాలల క్రీడోత్సవ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ...