Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 September 2024, 6:26 pm Posted by : ramakrishna

గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవాలి

  • తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రీడాల్లో ప్రోత్సహించాలి
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

బతుకమ్మ, భీమ్ గల్ : క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోని ముందుకు వెళ్లాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఉద్బోదించారు. ఆదివారం భీమ్ గల్ మండల కేంద్రంలోని కృషి హైస్కూల్ స్టేడియం లో నిర్వహించిన ఎస్ జీ ఎఫ్ మండల అంతర్ పాఠశాలల క్రీడోత్సవ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదువుతో పాటు క్రీడాలోనూ ప్రోత్సహించాలని ఆయన కోరారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, ఆరోగ్యం, ఫిజికల్ ఫిట్టనెస్ తో పాటు మనో నిబ్బరం వస్తుందన్నారు. మన గ్రామీణ ప్రాంతాల నుండి క్రీడాకారులు రాష్ట్ర, దేశ స్థాయిలో రాణించి ఆడినవారు ఉన్నారని, అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు దూసుకెళ్లాలని సూచించారు. తన తండ్రి సురేందర్ రెడ్డి క్రీడా ప్రియుడెనని ఈ ఆటలకు అతిత్యం ఇచ్చిన రవీందర్ రెడ్డి క్రీడల ప్రియేడే నన్నారు. అన్ని పాఠశాలల్లోవిద్యార్థులు మార్చ్ ఫాస్ట్, కల్చరల్ ఆక్టివిటీస్ లో చాలా ప్రతిభ కలిగి ఉన్నారని వారందరికీ ఆశీస్సులు తెలియజేశారు. మా వియ్యంకుడు దయానంద్ రెడ్డి జిల్లాలో అనేక పాఠశాలలకు డెస్క్ బెంచ్ లు, కంప్యూటర్లు, డ్రెస్ మెటీరియల్, స్పోర్ట్స్ మెటీరియల్స్ లను అందజేశారన్నారు. ఈ ఆటలకు తన వంతుగా సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన దాత పద్మ జగదీశ్ ను ఎమ్మెల్యే అభినందించారు. మార్చ్ ఫాస్ట్ లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆయన మెమంటోలను అందజేశారు.

Wins and losses should be taken equally