Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 July 2025, 7:12 pm Posted by : ramakrishna

మెడల్స్ సాధించడం జిల్లాకే గర్వకారణం

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మొట్టమొదటి సారిగా జాతీయ స్థాయిలో 24 గోల్డ్ మెడల్స్, 11 సిల్వర్ మెడల్స్, 3 బ్రౌన్స్ మెడల్స్ సాధించడం ఇందూర్ జిల్లాకే గర్వకారణం అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. టైక్వాండో ఫెడరేషన్ అఫ్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో గత నెల గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఎనిమిదోవ ఓపెన్ నేషనల్స్ ఛాంపియన్షిప్ లో మన జిల్లాకు మెడల్స్ సాధించిన  ఆమె చూర్ టైక్వాండో అసోసియేషన్ కి చెందిన 38 క్రీడాకాలను అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ అభినందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ఇందూర్ జిల్లా అంటేనే క్రీడాకారులకు పుట్టినిల్లని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఇందూర్ క్రీడాకారులు తెలంగాణలో ఆదర్శంగా

Winning medals is a source of pride for the district.

నిలుస్తున్నారని అన్నారు. క్రీడాకారులు క్రీడాలతో పాటు విద్యలో కూడా ఉత్తీర్ణత సాధించాలని  అప్పుడే ఉన్నత శిఖరాలను అవరోదించగలుగుతారని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సాహించేల వారికీ అండగా ఉంటానని త్వరలో మన జిల్లాలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించే క్రీడాకారులను తయారు చేసి ఇందూర్ జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్న టైక్వాండో  మాస్టార్ ను మనోజ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మెడల్స్ సాధించిన క్రీడాకారులు, తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Winning medals is a source of pride for the district.