క్రీడల్లో గెలుపోటములు సహజం

బతుకమ్మ, బాల్కొండ:  క్రీడల్లో గెలుపోటములు సహజమని గెలిచినవారు పొంగిపోకుండా ఓడిన వారు కుంగిపోకుండా పట్టుదలతో ముందుకు సాగాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఉమ్మడి బాల్కొండ మండలం అంతర్ పాఠశాలల క్రీడల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కబడీ ఫైనల్ మ్యాచ్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బాల్కొండ జెడ్పిహెచ్ఎస్ ముక్కాల్ మధ్య మ్యాచ్కు టాస్ వేసి క్రీడాకారులు పరిచయం చేసుకొని మ్యాచ్ ప్రారంభించారు. అనంతరం బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొని క్రీడల్లో గెలుపొందిన జట్లకు...