ఆటల్లో గెలుపోటములు సహజం

  మోర్తాడ్, బతుకమ్మ :   క్రీడల్లో గెలుపు ఓటములు అనేవి సహజమని గెలిచినవారు సంతోషపడకుండా, ఓడినవారు కృంగిపోకుండా స్నేహపూర్వకంగా ఉండాలని మోర్తాడ్ మండల ఎంఈఓ సమ్మిరెడ్డి అన్నారు. క్రీడలు ఆడడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ సీఎం కప్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం క్రీడా పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులను అందించారు. బాలుర విభాగంలో మొదటి స్థానం మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ జట్టు కైవసం చేసుకోగా, మాక్లూర్ మండలం...