Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 6:05 pm Posted by : ramakrishna

ఆటల్లో గెలుపోటములు సహజం

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

క్రీడల్లో గెలుపు ఓటములు అనేవి సహజమని గెలిచినవారు సంతోషపడకుండా, ఓడినవారు కృంగిపోకుండా స్నేహపూర్వకంగా ఉండాలని మోర్తాడ్ మండల ఎంఈఓ సమ్మిరెడ్డి అన్నారు. క్రీడలు ఆడడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ సీఎం కప్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం క్రీడా పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులను అందించారు. బాలుర విభాగంలో మొదటి స్థానం మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ జట్టు కైవసం చేసుకోగా, మాక్లూర్ మండలం మామిడిపల్లి జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది.

 

Winning and losing in games is natural.

బాలికల విభాగంలో రెంజల్ మండలం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు జట్టు ప్రథమ స్థానంలో నిలువగా,ద్వితీయ స్థానంలో మోర్తాడ్ బాలికల పాఠశాల జట్టు నిలిచింది.

 

Winning and losing in games is natural.

ఈ కార్యక్రమంలో మోర్తాడ్ గ్రామ సర్పంచ్ భోగా నిత్యా నంద్, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్, మోర్తాడ్ వార్డు సభ్యులు మురళి,నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి బోనగిరి శ్యామ్, కోశాధికారి రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేష్, వైస్ ప్రెసిడెంట్ రాజేష్, నిజామాబాద్ సెక్రటరీ రమణమూర్తి, భాగ్యశ్రీ,భారతి,గీత, కార్తీక్,ఆనంద్,బాల్ బ్యాడ్మింటన్ సంఘ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Winning and losing in games is natural.